మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్యాస్ బండల సరఫరా కోసం ... 10 గిరిజన గ్రామస్తుల వినూత్న నిరసన

1 గంట క్రితం

Innovative protest by 10 tribal villagers over gas cylinder supply.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 12:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

Z. జోగంపేట గ్రామంకు గ్యాస్ సరఫరా చేయాలి

10 గిరిజన గ్రామాల మహిళలు డిమాండ్

గ్యాస్ బండలు పట్టుకొని వినూత్నంగా ధర్నా నిర్వహించడం జరిగింది


రావికమతం (అనకాపల్లి) : 10 గిరిజన గ్రామాల ప్రజలు ఖాళీ గ్యాస్ బండలతో మంగళవారం వినూత్న నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో 1 బంగారు బంధాలు. 2. కడగడ్డ. 3. అజయ్ పురం. 4. జెడ్ జోగంపేట. 5. గంగంపేట. 6. నేరేడు బంధం. 7. పెద్ద గోరువు, 8. రాయపాడు, 9. రోచ్చుకొనుకు, 10. తాటిపర్తి, 11. జీలుగులోవ ... గ్రామాల్లో 174 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గ్యాస్ తీసుకోవాలంటే చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. తాము వెళ్లేసరికి గ్యాస్ బండ అందడం లేదు. కనీసం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. Z.జోగంపేట సెంటర్ పాయింట్ గా చేస్తే చుట్టుపక్కల గ్రామాల అందరికీ అది ఉపయోగంగా ఉంటుంది. గ్రామస్తులంతా గుర్రాల మీద గ్యాస్ బండ్లు తీసుకొని వస్తున్నారు. జోగంపేట గ్రామంలో రేషన్ డిపో పాయింట్ కూడా ఉంది. గతంలో ఎమ్మార్వో కు కూడా ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు. గ్యాస్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు కానీ నేటికీ గ్యాస్ కంపెనీ రాకపోవడంతో 24-8-2026 తేదీన సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కి, ఎస్టేట్ సివిల్ సప్లై ఆఫీసర్ కి ఫిర్యాదు చేసి ఉన్నామన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని, ట.జోగంపేట సెంటర్ పాయింట్ గా చేసి గ్రామస్తులందరికీ గ్యాస్ బండ అందేలా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులంతా కోరారు. ఈ కార్యక్రమంలో గోడ రాజేశ్వరి బిడ్డ జర్నీ తులసమ్మ కే భవాని. పాంగి సీతారాం వంతల దశాంతి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్