ప్రజాశక్తి - తుళ్లూరు (అమరావతి) : రాజధాని అమరావతిలో వచ్చే జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు. మంగళవారం అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .... క్వాంటం కంప్యూటింగ్ త్వరలో అందుబాటులోకి వస్తుందని, అమరావతి నాలెడ్జ్ హబ్ గా తయారవుతుందని చెప్పారు. జర్మన్ టెక్నాలజీతో క్వాంటం తయారవుతుందని, డిసెంబర్ చివరినాటికి క్వాంటం కంప్యూటింగ్ బిల్డింగ్ సిద్ధం అవుతుందన్నారు. హైదరాబాద్ లో ఐటీ హబ్ ఎలా ఉందో అమరావతి లో క్వాంటం కంప్యూటింగ్ ఆ విధంగా ఉండబోతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటి రంగంలో దూసుకువెళుతున్నారని మంత్రి చెప్పారు.
అమరావతిలో జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ సేవలు : మంత్రి పి.నారాయణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)