శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గెలుపొందిన సిపిఎం ఎంపిటిసిలు

1 గంట క్రితం

zptc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 01:12 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- 15 స్థానాలు కైవసం

- ఏజెన్సీలో ఉద్యమ వీరులకు పట్టం కట్టిన ఓటర్లు

ప్రజాశక్తి - యంత్రాంగం : ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో సిపిఎం హవా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 15 స్థానాలను కైవసం చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జిఒ నెం. 3 పునరుద్ధరణ, గిరిజన మాతృభాషలైన 'సవర' వంటి భాషల పరిరక్షణ, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, పోలవరం నిర్వాసితుల సమస్యలు, అటవీ హక్కుల చట్టం అమలు వంటి గిరిజన ప్రాధాన్యత అంశాలపై సిపిఎం చేసిన నిరంతర పోరాటాలను ఓటర్లు గుర్తించి పట్టం కట్టారు. ఈ గిరిజన ప్రాంతాలతో పాటు కర్నూలు, కృష్ణా, నెల్లూరు, ఏలూరు జిల్లాల్లోని పలు స్థానాల్లో విజయం సాధించింది.

అల్లూరి జిల్లాలో అనంతగిరి మండలం వేంగడ ఎంపిటిసి స్థానంలో సిపిఎం అభ్యర్థి సాలెపి సింహాచలం గెలుపొందారు. ఆమెకు 1089 ఓట్లురాగా వైసిపి అభ్యర్థి కె.చంపావతికి 535 ఓట్లు వచ్చాయి. దీంతో మెజార్జీ 554 దక్కింది. ముంచింగిపుట్టు మండలం లక్ష్మీపురం ఎంపిటిసి స్థానంలో సిపిఎం అభ్యర్థి కొర్రా మల్లేశ్వరరావు గెలుపొందారు. ఆయనకు 533 ఓట్లురాగా టిడిపి అభ్యర్థి రెయ్యల కృష్ణారావుకు 278 ఓట్లు వచ్చాయి. మెజార్టీ 255 మెజార్టీ దక్కింది. పోలవరం జిల్లాలో చిన్న మట్టపల్లి ఎంపిటిసి స్థానం నుండి సిపిఎం అభ్యర్థి సున్నం రాజులుకు 1356 ఓట్లురాగా వైసిపి అభ్యర్థి జి.నవీన్‌‌కుమార్‌కు 1250 వచ్చాయి. 106 ఓట్ల మెజార్టీ దక్కింది. రామవరం ఎంపిటిసి స్థానం నుంచి కారం సుందరయ్య విజయం సాధించారు. ఆయనకు 889 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి లక్ష్మయ్యకు 705 ఓట్లు వచ్చాయి. మెజార్టీ 184 దక్కింది. కూనవరం మండలంలోని పెద్దార్కూర్‌ ఎంపిటిసి స్థానం నుంచి సిపిఎం అభ్యర్థి పాయం సీతారామయ్య... టిడిపి అభ్యర్థి సోమక సత్యనారాయణపై 784 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రేగులపాడు ఎంపిటిసి స్థానం నుంచి గుండం బుచ్చమ్మ... టిడిపి అభ్యర్థి మోసం జయమ్మపై 256 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎటపాక మండలం విస్సాపురం ఎంపిటిసి స్థానంలో సిపిఎం అభ్యర్థి సోందే రామారావు.. టిడిపి అభ్యర్థి పెనుబల్లి సాయిబాబుపై 289 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నాల్లవరం సిపిఎం ఎంపిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన ఊకే సరోజిని 524 ఓట్ల వచ్చాయి. ప్రత్యర్థి టిడిపి అభ్యర్థికి 268 ఓట్ల వచ్చాయి. దీంతో 256 ఓట్ల మెజార్టీతో సరోజిని గెలుపొందారు. బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరం2లో సిపిఎం అభ్యర్థి కనకమ్మ78 ఓట్ల మెజార్టీ తో జనసేన పై గెలుపొందారు.

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అన్నారెడ్డి పాలెం గ్రామం ఎంపిటిసి సిపిఎం అభ్యర్థి కోసూరు వెంకటరమణమ్మ 685 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి టిడిపి అభ్యర్థికి 580 ఓట్లు వచ్చాయి. 105 ఓట్ల మెజార్టీతో వెంకటరమణమ్మ గెలుపొందారు. కర్నూలు కోడుమూరు ఎంపిటిసి-5వ స్థానంలో సిపిఎం అభ్యర్థి నాగిరెడ్డికి 1407 ఓట్లు, ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి గుండు నగేష్‌ 1084 ఓట్లు వచ్చాయి. దీంతో సిపిఎం అభ్యర్థి 323 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్‌టిర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి ఎంపిటిసి సిపిఎం అభ్యర్థి దారేల్లి రాజా 257 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరు ఎంపిటిసి గా సిపిఎం అభ్యర్థి అజ్మీర జ్యోతి..తన ప్రత్యర్థి టిడిపి అభ్యర్థిపై 58 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మార్కాపురంలో ఒకటి, శ్రీకాళహస్తిలో ఒక స్థానం ఏకగ్రీవం అయింది.


6 స్థానాల్లో సిపిఐ గెలుపు

ప్రజాశక్తి-అమరాతి బ్యూరో: ఎంపిటిసి ఎన్నికల్లో సిపిఐ 6 చోట్ల గెలుపొందింది. అందులో ఒకచోట ఎన్నిక ఏకగ్రీవమైంది. పోలవరం జిల్లా ఎటపాక మండలం కృష్ణవరంలో సున్నం పున్నమ్మ, కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి-2లో చిలకా కృష్ణవేణి, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో బంట్రోతు గౌరీ, అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం గోవిందంపల్లిలో చిట్టెమ్మ (ఏకగ్రీవం), కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డిలో యక్కల పీతాంబరధరరావు, అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లిలో గౌని శారద విజయం సాధించారు. సున్నం పున్నమ్మ 472 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిలకా కృష్ణవేణి 123 ఓట్లు, బంట్రోతు గౌరీ 90, యక్కల పీతాంబరధరరావు 25, గౌని శారద 76 ఓట్ల మెజారిటీలతో గెలుపొందారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్