- ఎన్నికల సిసి టిపి ఫుటేజ్ 60 రోజులు భద్రపరుస్తాం
- ఎస్ఈసి అనిల్ చంద్ర పునేతా
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాల్టీల ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటా మని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేతా తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధిత జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో శనివారం కౌంటింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న మున్సిపాల్టీల ఎన్నికల నిర్వహణ అంశాన్ని హైకోర్టు ఉత్తర్వుల మేరకు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటా మని వివరించారు. పల్నాడు జిల్లా కంకణాల పల్లి గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తు లు తమ సమస్యలపై అందించిన వినతులపై కమిషనర్ స్పందించారు. గ్రామ స్థాయిలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కా రానికి సంబంధిత జిల్లా కలెక్టర్ తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశిత 13 వేల గ్రామపంచాయ తీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, వీటితో పాటు హైకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రికార్డు చేసిన సిసి టివి ఫుటేజ్‌లను 60 రోజుల పాటు భద్రపరుస్తామని అన్నారు. ఏదైనా కోర్టు, ట్రిబ్యునల్‌లో కేసులు పెండింగ్‌లో ఉంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంచుతామని తెలిపారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, రిటర్నింగ్ అధికారులు హిమశైలజ, మయూరి, ఆర్‌డిఒ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సిఇఒ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)