ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి-2027 పరీక్షల ఫీజు ఈ నెల 11 నుంచి చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు కెవి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు ఎలాంటి అపరాధం రుసుం లేకుండా చెల్లించాలని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200లతో డిసెంబర్ 9వ తేదీ వరకు, రూ.500లతో డిసెంబర్ 15వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టులులోపు పరీక్షకు హాజరయ్యే వారు రూ.110 చొప్పున చెల్లించాలన్నారు. వొకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60, వయసు తక్కువ ఉంటే రూ.300 చెల్లించాలని వివరించారు. పాఠశాల లాగిన్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
11 నుంచి ‘టెన్త్’ ఫీజు చెల్లింపు...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 08, 2026, 01:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)