ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానాం, రాయల సీమ ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపింది. ఎపి, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఒకట్రెండు చోట్ల పిడుగులతో కూడిన మెరుపులు సంభవించొచ్చని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
3 రోజులపాటు వర్షాలు..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 08, 2026, 01:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)