మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉపాధ్యాయ ఓటర్ల నమోదుపై రోజువారీ సమీక్షలు

1 గంట క్రితం

Delhi Rao.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 12:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని, 2021 ఎన్నికల్లో నమోదైన ఓటర్ల సంఖ్యకు దీటుగా ప్రస్తుత నమోదు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు ఆదేశించారు. నవంబరు 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు కల్పించేలా రోజువారీ సమీక్షలు నిర్వహించాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2021లో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటర్ల సంఖ్యతో ప్రస్తుత నమోదు గణాంకాలను పోల్చితే తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. కాకినాడ, గుంటూరు పరిధిలోని సంబంధిత ఇఆర్ఒ, డిఆర్ఒలు, విద్యాశాఖ జిల్లా స్థాయి అధికారులతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ఉపాధ్యాయులెవరూ ఓటరు నమోదుకు దూరం కాకుండా చూడాలని పేర్కొన్నారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్