నేడు న్యూజిలాండ్‌తో తొలి వన్డే
ఉదయం 7.30గం.ల నుంచి
ఆక్లాండ్: టి20 సిరీస్ గెలుపుతో టీమిండియా ఇక వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారతజట్టు ఈడెన్ పార్క్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో తలపడనుంది. 2027 వన్డే ప్రపంచకప్‌నకు సన్నద్ధతలో భాగంగా ఈ వన్డే సిరీస్ రెండు జట్లకు సువర్ణావకాశంగా ఉపయోగపడనుంది. మరోవైపు టీమిండియా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(రో), విరాట్ కోహ్లి(కో) ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. వీరిద్దరూ వన్డే ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో వారి ఆట విదేశీ గడ్డపై ఏ మేరకు కనబరుస్తారోనని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు ఐదు టి20ల సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకొని న్యూజిలాండ్ గడ్డపై రికార్డు నెలకొల్పింది. తొలి మూడు టి20 మ్యాచ్‌లలో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్నా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. తొలి మూడు వన్డేలకు శుభ్‌మన్ గిల్, ఆ తర్వాత రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులు కూడా యువ సారథులతో కలిసి బరిలోకి దిగనున్నారు. ఎందుకంటే, కివీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు గిల్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆ తర్వాత ముందుగానే వెనుదిరగనున్నారు. ఇక కోహ్లి, రోహిత్ టెస్టు, టి20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
వన్డే సిరీస్ ముగిసిన అనంతరం వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో నవంబర్ 19 నుండి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మౌంట్ మాంగనుయీలోని బే ఓవల్‌లో 16న జరిగే చివరి వన్డేతో సిరీస్ ముగియనుంది. అనంతరం రెండు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్ జరగనుంది. 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) సైకిల్‌లో భాగంగా భారత్ 51.52 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో ఉంది.
మరోవైపు న్యూజిలాండ్‌కు గాయాల బెడద తప్పలేదు. రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ వన్డే సిరీస్‌కు ఇప్పటికే దూరమయ్యారు. ప్రాక్టీస్‌లో మాట్ హెన్రీ, డెవాన్ కాన్వే గాయాలబారినపడి తొలి వన్డేకు అందుబాటులో ఉండడం లేదు. వీరితో పాటు, పేసర్లు జాక్ ఫౌల్క్స్ మరియు విల్ ఓ'రూర్కే కూడా గాయాల కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నారు. తొలి వన్డే జరిగే ఆక్లాండ్‌లో ఉదయం చిరు జల్లులు కురిసే అవకాశమున్నట్లు ఇక్కడి వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఎండ రానున్నట్లు ఓవరాల్‌గా ఈ వన్డే పూర్తి స్థాయిలో జరగనున్నట్లు, మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 19-20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనున్నట్లు వాతావరణ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.
జట్లు(అంచనా)...
ఇండియా: గిల్(కెప్టెన్), కోహ్లి, శ్రేయస్(వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్, నమన్ ధీర్/కుల్దీప్, నితీశ్, సిరాజ్, గుర్నూర్, ఆర్ష్‌దీప్.
న్యూజిలాండ్: సాంట్నర్(కెప్టెన్), షెఫర్ట్, యంగ్, మిఛెల్, లాథమ్(వికెట్ కీపర్), ఫిలిప్స్, బ్రాస్‌వెల్, స్మిత్, జేమీసన్, డఫీ, హెన్రీ.







కామెంట్‌లు (0)