మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉక్కునగరంలో ఎగిరిన ఎర్రజెండా..

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 01:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విజయవాడలో సత్తిబాబు గెలుపు

  • మరో నాలుగు చోట్ల వార్డు సభ్యులుగా సిపిఎం విజయం

ప్రజాశక్తి - యంత్రాంగం : విశాఖ ఉక్కు నగరంలో ఎర్రజెండా మళ్లీ ఎగిరింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న సిపిఎంకే అక్కడి ఓటర్లు తాజా ఎన్నికల్లోనూ పట్టం కట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ పరిధిలోని 105వ డివిజన్‌‌లో గత రెండు ఎన్నికల్లో సిపిఎం గెలిచిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో సిపిఎంను ఓడించడమే లక్ష్యంగా అధికార కూటమి పన్నిన కుట్రలను ప్రజానీకం తిప్పి కొట్టారు. హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి ఎం. కృష్ణయ్య గెలుపొందారు. ఆయన సమీప కూటమి అభ్యర్థి పైన 107 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. విజయవాడ నగర పాలక సంస్థలోనూ సిపిఎం గత ఎన్నికల్లో గెలిచిన 52వ డివిజన్‌‌ను నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో గెలుపొందిన బోయ సత్తిబాబునే తాజా ఎన్నికల్లోనూ అభ్యర్థిగా సిపిఎం ఎన్నికల బరిలోకి దింపింది. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్థిపై 1,431 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.. ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా తిరువూరులో 13వ వార్డు నుండి సిపిఎం అభ్యర్థిగా పోటీచేసిన మేడిపల్లి నగమణి 34 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 21వ వార్డు నుండి బరిలోకి దిగిన కొప్పోలు సత్యవతి సమీప టిడిపి అభ్యర్థిపై 23 ఓట్లతో విజయం సాధించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో 19 వ వార్డు నుండి బరిలోకి దిగిన డి. లక్ష్మణ్‌ 16 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అదే విధంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో నంద్యాల జిల్లా ఆత్మకూరులో 23 వ డివిజన్‌ ‌నుండి సిపిఎం తరపున బరిలోకి దిగిన ఎ. రణధీర్‌ 360 తో విజయం సాధించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్