శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిన్న గుండెపోటుతో మృతి - నేడు ఎంపిటిసి గా విజయం

5 గంటల క్రితం

Died of a heart attack yesterday won as an MPTC member today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దేవరపల్లి (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య (28) స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ... ఎన్నికల పోలింగ్ ముగిసి కౌంటింగ్ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే దివ్య హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. అప్పటివరకు తమ మధ్య చిరునవ్వుతో మెలిగిన యువ నేత హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో దివ్య ఘన విజయం సాధించినట్లు వెల్లడైంది. ప్రత్యర్థి అయిన అధికార వైసిపి అభ్యర్థిపై ఏకంగా 352 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె గెలుపొందారు. అధికారులు ఆమె విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ విజయం గ్రామంలో సంతోషాన్ని తీసుకురావడానికి బదులు మరింత శోకాన్ని మిగిల్చింది. గెలుపు వార్త తెలిసిన తర్వాత ధుమంతునిగూడెంలో ఆనందోత్సాహాల కంటే తీవ్ర విషాదమే నిండిపోయింది. ఎన్నికల ప్రచారంలో రాత్రింబవళ్లు తమ వెంట నడిచిన అభ్యర్థి, ఇప్పుడు తమ మధ్య లేరనే నిజాలాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. దివ్యది ప్రేమ వివాహం. ఆమెకు ఐదేళ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు చిన్నారులున్నారు. పలు పార్టీల నేతల సంతాపాన్ని వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్