ప్రజాశక్తి- అనకాపల్లి
కార్మికోద్యమ నేత ఎస్. రమేష్ 9వ వర్ధంతి సభ అనకాపల్లిలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించారు.రమేష్ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు కర్రి అప్పారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఉమ్మడి విశాఖ జిల్లా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో రమేష్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. తన తుదిశ్వాస వరకు కార్మికులు, కష్టజీవుల పక్షాన నిబద్ధతతో పోరాడిన ధన్యజీవి అని కొనియాడారు. జిల్లాలో ఎక్కడ కార్మిక పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమై, కార్మికులతో మమేకమై పోరాటాలు నిర్వహించేవారని గుర్తుచేశారు.
విద్యార్థి ఉద్యమం అనంతరం ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోకి వచ్చిన రమేష్, చిట్టివలస జూట్ మిల్లు కార్మిక సంఘం నాయకుడిగా అనేక పోరాటాలు నిర్వహించారని, గ్రామీణ ప్రాంతాల్లో ట్రేడ్ యూనియన్ ఉద్యమ విస్తరణకు విశేష కృషి చేశారన్నారు. ఆయన లేకపోవడం కార్మికోద్యమానికి తీరనిలోటు అన్నారు. . కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా పెద్దఎత్తున ఐక్య పోరాటాలు నిర్వహించడమే రమేష్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే. ఈశ్వరరావు, ఏ. రాజు, బి. నూక అప్పారావు పాల్గొన్నారు.
పరవాడ: : స్థానిక సినిమా హాల్ జంక్షన్లో కార్మికోద్యమ నేత ఎస్. రమేష్ 9వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. రమేష్ చిత్రపటానికి సిపిఎం నాయకులు బొద్దపు శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తన తుదిశ్వాస వరకు కార్మికులు, కష్టజీవుల పక్షాన నిబద్ధతతో పోరాడిన ధన్యజీవి రమేష్ అని కొనియాడారు. మ్మడి విశాఖపట్నం జిల్లా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో రమేష్ పోషించిన కీలక పాత్ర పోషించారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే. అప్పారావు, ఎన్. గురునాధరావు, వెంకు నాయుడు పాల్గొన్నారు








కామెంట్లు (0)