శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సదుపాయాల లేమిపై అధికారుల మధ్య వాగ్వాదం- కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం

2 గంటల క్రితం

సదుపాయాల లేమిపై అధికారుల మధ్య వాగ్వాదం
కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 07:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కనీస సదుపాయాలు లేకపోవడం అధికారుల మధ్య బహిరంగ వివాదానికి దారితీసింది. కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో కనీసం తాగునీటి సదుపాయం కూడా లేకపోవడంతో కౌంటింగ్‌కు హాజరైన ఎన్నికల ఏజెంట్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాట్లలో దారుణమైన నిర్లక్ష్యంపై ఏజెంట్లు గరంగరం కావడంతో కేంద్రం వద్ద ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.


అధికారుల మధ్య రచ్చ.. రంగంలోకి కలెక్టర్

ఈ క్రమంలోనే సదుపాయాల కల్పన లోపాలపై కాకినాడ ఆర్డిఒ ఎస్.మల్లిబాబు, జడ్పీ సిఇఒ లక్ష్మణరావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఏర్పాట్ల వైఫల్యానికి ఒకరినొకరు నిందించుకుంటూ ఇరువురు ఉన్నతాధికారులు కొద్దిసేపు వాదోపవాదాలకు దిగడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ హుటాహుటిన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. వివాదంలో ఉన్న ఇరువురు అధికారులతో మాట్లాడి, వారిని శాంతింపజేసి వివాదాన్ని సద్దుమణిగించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో కనీసం తాగునీరు కూడా కల్పించకపోవడంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్