ఆల్ ఇండియా వైద్య ప్రవేశ పరీక్షలో కదిరి పట్టణానికి చెందిన వై. వికాష్ రెడ్డి 453 ర్యాంక్ తో సత్తా చాటారు.
జాతీయ స్థాయి వైద్య విద్యా ప్రవేశ పరీక్ష ఫలితాలలో కదిరి పట్టణానికి చెందిన వై. వికాష్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. స్థానిక ఎన్జీఓ కాలనీకి చెందిన ఆయన, జాతీయ స్థాయిలో 453వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు హర్ష వ్యక్తం చేశారు .డాక్టర్ వికాష్ రెడ్డి వైద్య ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబర్చడంతో ఆయన తల్లిదండ్రులు వి. వింధ్య రాణి వై.వి. సుబ్బారెడ్డి కుమారుడి కష్టానికి తగిన ఫలితం దక్కిందనీ ఆనందం వ్యక్తం చేశారు. . భవిష్యత్తులో వికాష్ రెడ్డి ఉన్నత చదువులు చదివి, సమాజానికి సేవలందిస్తూ ఒక మంచి వైద్యుడిగా ప్రజలకు సేవలందించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ వికాష్ రెడ్డికి కాలనీ ప్రజలు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలిపారు.







కామెంట్‌లు (0)