అమరావతి : అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సిఎం బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం రాత్రి 1.30 గంటల వరకు అధికారులతో సమీక్షించిన సీఎం.. బుధవారం ఉదయం 6 గంటల తర్వాత మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అర్నబ్ ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు సిఎంకు వెల్లడించారు. తుపాను తీవ్రతకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని అధికారులు తెలిపారు. రోడ్లపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని, తుపాను తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. పలు జిల్లాల కలెక్టర్లు తాము చేపడుతున్న సహాయక చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని ఆ జిల్లా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
తుపాను వేళ.. సహాయక చర్యలు చేపట్టండి : సిఎం చంద్రబాబు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 28, 2026, 11:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)