మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకేంద్ర ఖజానాపై పశ్చిమాసియా ప్రభావం

-44219 నిమిషాల క్రితం

కేంద్ర ఖజానాపై పశ్చిమాసియా ప్రభావం
మరోసారి వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం
ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ అంచనా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మరోసారి వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం

  • ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ అంచనా

​ముంబయి: పశ్చిమాసియా సంక్షోభంతో కేంద్ర ఖజానాపై భారీ ఆర్థిక భారం పడుతోందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు, సబ్సిడీల వ్యయం, పన్ను ఆదాయాల్లో తగ్గుదలతో ఇప్పటివరకు ప్రభుత్వంపై దాదాపు రూ.1.35 లక్షల కోట్ల మేర ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎరువులు, వంటగ్యాస్‌ సబ్సిడీలకు అదనపు కేటాయింపులు, పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపుతో ఆదాయం పడిపోవడం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. చమురు మార్కెటింగ్‌ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్లు, ప్రత్యక్ష పన్నుల వసూళ్లపైనా ప్రభావం ఉండవచ్చన్నారు. అయితే సాధారణ వ్యయాల్లో మిగులు, కొన్ని పన్ను వసూళ్లలో పెరుగుదల ద్వారా ఈ భారాన్ని ప్రభుత్వం కొంతవరకు భరించగలదని అభిప్రాయపడ్డారు. ​బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాల వసూళ్లు అంచనాల కంటే ఎక్కువగా ఉండటం కొంత ఊరటనివ్వవచ్చన్నారు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం ప్రభుత్వ ఖజానాకే పరిమితం కాకుండా సామాన్య ప్రజలపై ధరల భారాన్ని పెంచే ప్రమాదముందని ఇక్రా హెచ్చరించింది. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం దాటవచ్చని అంచనా వేసింది. ధరల ఒత్తిడిని నియంత్రించేందుకు ఆర్‌బిఐ డిసెంబర్‌ ద్రవ్య పరపతి సమీక్షలో మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నాయర్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్