ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు

10 సెప్టెంబర్, 2026

el nino
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:56 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పంటలు, రైతులు, పశుసంపద రక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

- ఎక్స్-ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు, ఉష్ణోగ్రతలు పెరగడం, పంటలు ఎండిపోవడం వంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక రంగాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ తెలిపారు. ఈ ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది ఫిబ్రవరి ప్రస్పుటంగా వ్యక్తం అవుతుందని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న కలెక్టర్ల సదస్సులో ఎల్‌నినో ప్రభావం, ఉపశమన చర్యలపై ఆయన వివరించారు. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం, ఎల్‌నినో ప్రభావం సాధారణ స్థాయిలను దాటి అత్యంత తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులు ముఖ్యంగా వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశుసంపద, నీటి వనరులు, గ్రామీణ జీవనంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ముందస్తు అంచనాల ఆధారంగా నివారణ చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని డబ్ల్యుఎంఒ సూచిస్తోందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వాతావరణ పరిస్థితుల నిరంతర పర్యవేక్షణ, రైతులకు సమయానుకూల సూచనలు, నీటి సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ సాగునీటి వినియోగం వంటి అనుకూల చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ మద్య తాము కేంద్ర వ్యవసాయ కార్యదర్శి కలిసినప్పడు ముందస్తు ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో ఎల్‌ నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొగలమనే విషయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు సాధారణ వర్షపాతం 457.9 మి.మీ.కు గాను 206.7 మి.మీ. మాత్రమే నమోదై -54.9 శాతం లోటు ఏర్పడిందని తెలిపారు. ఖరీఫ్ సాగు విస్తీర్ణం 22.82 లక్షల హెక్టార్లకు చేరగా, సాధారణ విస్తీర్ణంలో 74 శాతం మేర సాగు నమోదైందన్నారు. తక్కువ నీటి అవసరమున్న కంది, పెసర, మినుము వంటి పంటల వైపు రైతులు మళ్లడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. పంటలను ఎల్‌నినో ప్రభావం నుంచి కాపాడేందుకు ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని, 8,489 రైతు సేవా కేంద్రాలు, 18,513 గ్రామాల ద్వారా ప్రతి రైతు, ప్రతి పంట పొలాన్ని కవర్ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 99.21 శాతం పంట ప్లాట్లలో క్రాప్ హెల్త్ రిపోర్టింగ్ పూర్తయిందని, తేమ ఒత్తిడి అధికంగా ఉన్న కర్నూలు, నంద్యాల, అనంతపురము జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. విత్తన కంటింజెన్సీ ప్రణాళికకు రూ.90 కోట్లు అదనపు బడ్జెట్ మంజూరు చేయడంతో పాటు శనగ విత్తన సబ్సిడీని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచామని, పచ్చిరొట్ట విత్తనాలకు 80 శాతం సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. అలాగే జూన్ 2027 వరకు 365 రోజుల పచ్చదనం లక్ష్యంగా పిఎండిఎస్‌, పెల్లెటైజేషన్ ద్వారా ఇప్పటివరకు 18.96 లక్షల ఎకరాల్లో కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్