మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition19న ఎంపిపి, 20న జెడ్‌‌పి ఛైర్మన్ల ఎన్నిక

3 గంటల క్రితం

Strict action will be taken if peace and order are disrupted during the election period: SEC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 12:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాష్ట్ర ఎన్నికల సంఘం

​ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 659 మండల పరిషత్‌లకు ఈ నెల 19న అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. 28 జిల్లా పరిషత్‌లకు ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలను 20న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 7న పూర్తై ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో పరోక్ష ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఎంపిపిలో ఒక కో-ఆప్టెడ్ సభ్యుడిని, ప్రతి జెడ్‌పిలో ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎన్నికైన ఎంపిటిసి, జెడ్‌పిటిసి సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులను ఈ నెల 14లోగా అందజేయనున్నట్లు పేర్కొంది. ప్రతి మండల ప్రజా పరిషత్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ గెజిటెడ్ అధికారిని నియమించాలని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్