మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Japan Masters : ప్రీ క్వార్టర్స్‌కు గాయత్రి, త్రీసా

2 గంటల క్రితం

womensbadminton-1794327502755-6691.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 01:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జపాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

టోక్యో: జపాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ ప్రీ క్వార్టర్‌ ఫైనల్లోకి త్రీసా జోలీ, గాయత్రి గోపీచంద్‌ ప్రవేశించారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో గాయత్రి-త్రీసా 21-17, 21-14తో వరుససెట్లలో జపాన్‌కు చెందిన హినాతా-నియో యమరికితాను ఓడించారు. ఈ గేమ్‌ను భారత షట్లర్లు కేవలం 42 నిమిషాల్లోనే ముగించారు. ఇక పురుషుల డబుల్స్‌లో హరిహరన్‌-ఎంఆర్‌ అర్జున్‌ జంట 11-6తో ఆధిక్యతలో ఉన్న దశలో మాజీ ప్రపంచ ఛాంపియన్స్‌, మలేషియాకు చెందిన ఆరోన్‌ ఛియా-సోహ్‌ వుయ్‌ టోర్నీ నుంచి వైదొలిగారు. తొలిరోజు భారత మిక్స్‌డ్‌ జంట దృవ్‌ కపిల-రాధికా శర్మ జంట ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది. కపిల-రాధిక జంట తొలి గేమ్‌లో 11-9 ఆధిక్యతలో ఉన్నా.. ఆ తర్వాత 21-16తో ఆ గేమ్‌ను ఓడారు. ఇక రెండో గేమ్లఓనూ ఒక దశలో 14-14తో స్కోర్‌ను సమం చేసినా.. ఆ గేమ్‌ను 21-15తో చేజార్చుకొని ఓటమిపాలయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్