మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టాటా ఐఫోన్ ఫ్యాక్టరీ లో విషాదం - విషం వాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి

18 నిమిషాల క్రితం

Tragedy at Tata iPhone factory Three workers die after inhaling toxic gases
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 02:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తమిళనాడు : అమెరికా దిగ్గజ సంస్థ ఆపిల్ ఐఫోన్ల విడిభాగాలను తయారు చేసే తమిళనాడులోని ప్రముఖ టాటా ఎలక్ట్రానిక్స్ కర్మాగారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి యాపిల్, టాటా సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా దర్యాప్తునకు ఆదేశించారు.


టాటా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ యూనిట్ భారత్ ‌లో దాదాపు 40 శాతం ఐఫోన్ అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా, మిగతా భాగం ఫాక్స్‌కాన్ చూసుకుంటోంది. అయితే గత కొన్ని నెలలుగా రామ్‌సవేర్ దాడి, భూగర్భ జలాల కాలుష్య సమస్యలు వంటి అనేక సవాళ్లను టాటా ఎదుర్కొంటోంది. తమిళనాడులోని హోసూర్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో ఎప్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


ఈ ప్లాంట్‌ను అమెరికాకు చెందిన ఈకోలాబ్ సంస్థకు చెందిన 'నాల్కో వాటర్' నిర్వహిస్తోందని జిల్లా అధికారి దినేష్ కుమార్ తెలిపారు. బాహ్య నానో-ఫిల్ట్రేషన్ ట్యాంక్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో కార్మికులు ప్రమాదవశాత్తు గ్యాస్ పీల్చడంతో ఊపిరాడక మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై టాటా ఎలక్ట్రానిక్స్, యాపిల్, నాల్కో వాటర్ సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.


తమిళనాడు పారిశ్రామిక శాఖా మంత్రి విరుదై మగల్ కీర్తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ... కార్మికుల మృతిపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ వారం ప్లాంట్‌కు సెలవు ప్రకటించి ఉండటంతో ఎలాంటి ఉత్పత్తికి అంతరాయం కలగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కాగా, హోసూర్‌లోని టాటా ప్లాంట్‌లో గతంలోనూ కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. 2024లో అగ్నిప్రమాదం జరగడం, ఈ ఏడాది భూగర్భ జలాల కాలుష్యంపై రాష్ట్ర అధికారులు హెచ్చరికలు జారీ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా, ఇదే కాంపౌండ్‌లోని మరో ప్లాంట్‌లో రామ్‌సవేర్ దాడి కారణంగా యాపిల్ ఐఫోన్ 18 ప్రొకి సంబంధించిన కీలక పత్రాలు లీకైన విషయం కూడా గమనార్హం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్