శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి

4 గంటల క్రితం

MP Avinash Reddy appears for ED questioning.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 07:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కడప ఎంపి వైఎస్ అవినాష్‌‌రెడ్డి

ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలని, ఊళ్లను చెడగొట్టే విధంగా రాజకీయం చేయొద్దని కడప ఎంపి వైఎస్ అవినాష్‌‌రెడ్డి అన్నారు. పులివెందులలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైసిపి నేతలను టిడిపి కూటమి నాయకులు ప్రశాంతంగా ప్రచారం చేసుకోనివ్వడం లేదన్నారు. ప్రచారంలో పాల్గొన్న వైసిపి నేతల ఆస్తులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కనీసం నోటీసులైనా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు గతంలో ఏనాడూ జరగలేదన్నారు. వేలాది మందిని బయట నుంచి తీసుకొస్తున్నారని, వారికి పోలీసులే సదుపాయాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఏజెంట్లను, ఓటర్లను బ్లాక్‌ చేసి దొంగ ఓట్లు వేసుకోవడానికి స్కెచ్‌ వేశారని ఆరోపించారు. టిడిపి నీచ ప్రణాళికలకు కర్నూలు రేంజ్‌ ‌డిఐజి కోయ ప్రవీణ్‌ పూర్తిగా సహకరిస్తున్నారని విమర్శించారు. టిడిపి కుట్రలను ఎస్‌ఇసి దృష్టికి వైసిపి తీసుకెళ్లిందన్నారు. ఫ్యాక్షనిజాన్ని చంద్రబాబు తట్టి లేపుతున్నారని విమర్శించారు. ఏజెంట్లను, ఓటర్లను రాకుండా చేసి దొంగ ఓట్లు వేసుకోవడానికి జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, పొద్దుటూరు నుంచి మనుషులను తెచ్చుకుని రిగ్గింగ్‌ ‌చేయాలని చూస్తున్నారన్నారు ఆరోపించారు. పులివెందుల మున్సిపాలిటీని దొంగల చేతుల్లో పెట్టకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్