డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ప్రైవేట్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఒకటి కుప్పకూలింది. బద్రీనాథ్ నుండి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాఫ్టర్ జోషిమఠ్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కూలిపోయినట్లు ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హెలికాప్టర్‌లో పైలెట్ సహా ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ బద్రీనాద్ నుండి డెహ్రాడూన్‌కు వస్తుండగా, చమోలీ జిల్లా జోషిమఠ్ ప్రాంతంలోని చాయ్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో కూలిపోయింది. ఈ హెలికాప్టర్ జెపి పవర్‌హౌస్ సమీపంలో ఒక కొండచరియను ఢీకొట్టిందని అన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్యపై అధికారిక సమాచారం లేదని అన్నారు.
ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)