బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయ డెయిరీ బోర్డు అత్యవసర సమావేశం రేపటికి వాయిదా

17 నవంబర్, 2026

Emergency meeting of the Vijaya Dairy Board adjourned until tomorrow
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 01:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోరం లేక వాయిదా.. హైకోర్టు తీర్పుపై సుదీర్ఘ చర్చ


అమరావతి : విజయ డెయిరీ బోర్డు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోర్డు అత్యవసర సమావేశం కోరం లేకపోవడంతో రేపటికి వాయిదా పడింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై సమావేశంలో చర్చించినప్పటికీ, తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ అంశంపై న్యాయపరమైన సలహా తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.


సమావేశం అనంతరం మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ... బోర్డు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కృష్ణా మిల్క్ యూనియన్ రైతుల సంస్థ కావడంతో అంతర్గత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశామని, రేపు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని చెప్పారు. కాగా ... విజయ డెయిరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్‌రావుతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల ఎన్నిక చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను డిఫాల్టర్లుగా ప్రకటించడంపై దాఖలైన పిటిషన్ల విచారణలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయ డెయిరీ పాలకవర్గంలో తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. రేపు జరగనున్న బోర్డు సమావేశం పై రైతులు, డెయిరీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్