- కాలిబూడిదైన పలు ద్విచక్ర వాహనాలు
ప్రజాశక్తి-తెనాలిరూరల్ : గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీనివాస బైక్ షోరూంలో రాత్రి 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు షోరూం అంతటా వ్యాపించడంతో లోపల ఉన్న పలు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని సుధాకర రాజు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.







కామెంట్‌లు (0)