- ఒకరికి గాయాలు
ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. విమానాశ్రయంలోని టెర్మినల్-2 వెలుపల ఫాల్స్ సీలింగ్‌లో కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక సందర్శకుడు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయ అత్యవసర వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన వ్యక్తికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించినట్లు ఓ అధికారి తెలిపారు. ఫాల్స్ సీలింగ్ కూలిపోవడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఫాల్స్ సీలింగ్ నిర్మాణాల స్థిరత్వాన్ని కూడా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకునే దిశగా అధికారులు పరిశీలన చేపట్టారు.







కామెంట్‌లు (0)