గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతొలి విడత పంచాయతీల్లో ఎన్నికలు పూర్తి ‌

23 నిమిషాల క్రితం

ఇచ్ఛాపురం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 12:23 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మధ్యాహ్నం 1 గంటకు 74.67 శాతం పోలింగ్‌ ‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 74.67 పోలింగ్‌ ‌శాతం నమోదయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలోని 3,240 గ్రామ పంచాయతీలు ఎన్నికల ప్రక్రియలోకి రాగా, సర్పంచ్ పదవులకు 3,189 పంచాయతీలు, వార్డు సభ్యుల పదవులకు 25,057 వార్డులు పోలింగ్‌ గురువారం జరిగింది. ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 74,45,583 ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, 55,55,961 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్పంచ్ పదవులకు 760 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, వార్డు సభ్యుల స్థానాల్లో 14,731 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు కలిపి 15,491 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 709 గ్రామ పంచాయతీల్లో పూర్తి పాలకవర్గం ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మరో 44 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపింది.

పల్లె పోలింగ్‌ ఇలా...

ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీల్లో ఉదయం 9 గంటలకు 16.25 శాతంగా ఉన్న పోలింగ్, 11 గంటలకు 53.86 శాతానికి పెరిగింది. ఆ తర్వాత మరో రెండు గంటల్లో 20.81 శాతం పాయింట్లు పెరిగి 74.67 శాతానికి చేరుకుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. పోలింగ్‌ 80 శాతం దాటిన జిల్లాల్లో ఏలూరు 84.83 శాతం, చిత్తూరు 83.29 శాతం, విజయనగరం 83.33 శాతం, నంద్యాల 82.50 శాతం, మార్కాపురం 81.70 శాతం, శ్రీ సత్యసాయి 81.44 శాతం, అనంతపురం 80.17 శాతం, బాపట్ల 80.23 శాతం, ప్రకాశం 80.25 శాతం నమోదైంది. మరోవైపు వైఎస్ఆర్ కడప జిల్లాలో 59.50 శాతం పోలింగ్ నమోదవగా, శ్రీకాకుళంలో అత్యల్పంగా58 శాతం నమోదైందని తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ ‌ప్రక్రియను ప్రారంభించిన అధికారులు తొలుత వార్డు సభ్యుల ఫలితాలను, అనంతరం కౌంటింగ్‌ ‌పూర్తయిన సర్పంచి స్థానాల ఫలితాలను వెల్లడిస్తున్నారు.

పట్టణ స్థానిక సంస్థల్లో పొలింగ్‌

వివిధ కారణాలతో వాయిదా పడినన 23 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్‌ ‌ప్రక్రియ గురువారం పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో 4 మేయర్‌ ‌స్థానాలకు 19 పురపాలక, నగర పంచాయతీల చైర్మన్‌ ‌స్థానాలతో పాటు 257 కార్పొరేటర్లు, 707 కౌన్సిలర్ల స్థానాలకు పోలింగ్‌ ‌నిర్వహించగా ఉదయం 9 గంటలకు పోలింగ్‌ ‌ప్రక్రియ ప్రారంభం అవగా సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 62.5 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 24,98,312 మంది ఓటర్లకు గాను 15,61,531 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రకాశం జిల్లా కందుకూరులో అత్యధికంగా 76.07 శాతం పోలింగ్ నమోదవగా, ఆ తర్వాత మార్కాపురం జిల్లా పొదిలిలో 75.68 శాతం, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 75.13 శాతం పోలింగ్ నమోదైందని, గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లిలో 72.62 శాతం పోలింగ్ నమోదవగా, బాపట్లలో 68.64 శాతం, అనమయ్య జిల్లా బి.కొత్తకోటలో 68.15 శాతం నమోదైందని తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు.

స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతం : డిజిపి

రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ, రెండో విడత మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయని డిజిపి హరీష్‌‌కుమార్‌ ‌గుప్తా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పల్నాడు, సత్యసాయి, నంద్యాల, వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి తదితర జిల్లాల్లో 44 ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్