గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమరింతగా ఆర్థిక సంస్కరణలు..!

-50 నిమిషాల క్రితం

ap.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 01:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ‘రీ ఇమాజినింగ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌’ పేరిట రాష్ట్ర ప్రభుత్వ సదస్సు

  • డిసెంబర్ 2 నుండి రెండు రోజుల నిర్వహణ

  • నిధుల సమీకరణకు కొత్త మార్గాల అన్వేషణ

  • తదుపరి తరం ప్రైవేటు భాగస్వామ్యం కోసం కసరత్తు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో మరింత వేగంగా ఆర్థిక సంస్కరణలను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రజా ఆర్థిక నిర్వహణలో సరికొత్త విధానాలు, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల సమీకరణ కోసమంటూ విజయవాడలో రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించనుంది. ‘రీ ఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్’ పేరిట డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో డిసెంబర్ రెండు, మూడు తేదీల్లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించనున్న ఈ సదస్సులో రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి . దేశంలో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న నేపధ్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు సావరిన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత పెట్టుబడి నిధులు, క్యాపిటల్ మార్కెట్లు, గ్రీన్ ఫైనాన్స్, కార్బన్ ఫైనాన్స్, విదేశీ వాణిజ్య రుణాలు, ప్రభుత్వ ఆస్తులను అమ్మడం (నగదీకరణ) వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రాధాన్యత నంతరించుకుంటుఆన్నయని ఆర్ధిక శాఖ అధికారులు గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రాలు సంప్రదాయ ఆర్థిక వనరులతో పాటు ఈ కొత్త మార్గాల ద్వారా కూడా నిధులు సమీకరించుకోవల్సిఉందని, ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నాయని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. సమయంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, తదుపరి తరం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (నెక్ట్స్‌ ‌జనరేషన్‌ ‌పిపిపి ) విధానాల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త మార్గాలపై కూడా ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ఆర్థిక సంస్థలు, సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బ్యాంకులు, రేటింగ్ సంస్థలు, టెక్నాలజీ, ఫిన్‌టెక్ కంపెనీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. వివిధ అంశాలపై నిర్వహించే సమావేశాలు, ప్యానెల్ చర్చలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లకు కీలకమైన అవగాహన, అభ్యాస అవకాశాలను కల్పించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన జిల్లాల కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. ప్రజా ఆర్థిక వ్యవస్థలో ఆధునిక విధానాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కొత్త ఆర్థిక మార్గాలను అన్వేషించేందుకు ఈ సదస్సు వేదిక కానున్నట్టు ఆర్థికశాఖ పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్