నాగ్‌పూర్ : లండన్‌లోని ప్రతిష్టాత్మక యూనివర్శిటీల నుండి 27ఏళ్ల వయసుకే సౌరవ్‌దాస్‌కు ఆహ్వానం అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈర్ష్య చెందిందని, అందుకే ఆయన్ను అక్కడ పర్యటించకుండా అడ్డుకుందని సిజెపి విమర్శించింది. సిజెపి వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే గురువారం నాగ్‌పూర్‌లో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. తనతో పాటు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాకు ఆహ్వానాలు అందాయని, అందులో భాగంగానే దాస్ లండన్ వెళ్లాలనుకున్నారని తెలిపారు. సౌరవ్ దాస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లాలని అనుకున్నారని, కానీ విమానాశ్రయానికి వెళ్లిన అడ్డుకున్నారన్నారు. నాగ్‌పూర్‌లోని ‘ సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ ’ ర్యాలీకి ముందు దీప్కే ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సం సందర్భంగా ఇక్కడి సంవిధాన్ చౌక్‌లో జరిగిన ఈ ర్యాలీలో దీప్కే మాట్లాడుతూ అంబేద్కర్ దార్శనికత, ఆలోచనలను ఎన్నికల లెక్కలకు, రాజకీయ కథనాలకు పరిమితం చేయకూడదని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడ్డం అందరి బాధ్యత అని పిలపునిచ్చారు. ఈ ర్యాలీకి భారీగా హజరైన నాగ్‌పూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Print Editionఈర్ష్యతోనే సౌరవ్‌దాస్‌ను అడ్డగించిన కేంద్రం : సిజెపి
21 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 12:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)