శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏ బిల్లు పెట్టినా సంపూర్ణ మద్దతు

1 గంట క్రితం

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 01:26 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కేంద్రాన్ని ప్రతిపక్షాలు ఇబ్బంది పెడితే కౌంటర్లివ్వండి

  • పార్టీ ఎంపిలతో
టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా సంపూర్ణ మద్దతివ్వాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ పార్టీ ఎంపిలకు దిశానిర్దేశం చేశారు. ​కొన్ని సున్నితమైన అంశాల్లో ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహిరిస్తే టిడిపి తరపున వాటికి గట్టిగా కౌంటర్లివ్వాలని సూచించారు. ఈ విషయంలో బిజెపి, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు అధ్యక్షతన టిడిపి పార్లమెంటరీ సమావేశం ఉండవల్లిలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, ఆర్థిక, వ్యవసాయ పాలసీలు, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, ఎస్‌ఐఆర్‌, వివిధ ప్రాజెక్టులకు విజిఎఫ్ అమలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని ప్రొత్సహిస్తే రైతులకు లాభంగా ఉంటుందని చెప్పిన చంద్రబాబు.. ఇథనాల్ పెట్రోల్ వల్ల ఇంజిన్లు చెడిపోతున్నాయనే అంశాన్ని ప్రస్తావించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ఎంపిలు చొరవ ఏ బిల్లు పెట్టినా సంపూర్ణ మద్దతు చూపాలన్నారు. ఆక్వా ఫీడ్ ధరలు పెంపుదల తగ్గింపు, ఫిష్ ఆయిల్ ఎగుమతుల నియంత్రణ వంటి అంశాలపై చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. ఆక్వా, పొగాకు సమస్యలపై కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్నారు. యుజిసి, ఎఐసిటిఇ, ఎన్‌‌సిటిఇ స్థానంలో ఏకీకృత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై అధ్యయనం చేయాలని పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు చంద్రబాబు ఆదేశించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఈ సమావేశంలో చంద్రబాబు అన్నారు. అన్ని స్థానాలనూ కైవసం చేసుకునేలా కూటమి పార్టీలతో కలిసి పనిచేయాలని, ఎంత మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆదేశించారు. త్వరలోనే ప్రజా ప్రతినిధులకు, పార్టీ యంత్రాంగానికి రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని, పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని దిశా నిర్దేశం చేశారు. పల్నాడులో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ తరహా కార్యక్రమాలను మరింత మంది ఎంపిలు నిర్వహించాలని సూచించారు. సోషల్‌‌ మీడియాలో దుష్ప్రచారం అంశాన్ని త్రీవంగా పరిగణించాలన్నారు. పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌నారా లోకేష్‌ ‌మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు, పదవులు దక్కించుకున్నవారు కార్యకర్తలతో తరచూ కలిస్తేనే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని తెలిపారు. పార్టీని కుటుంబంగా భావించి తనతో పాటు అందర్నీ ముందుకు తీసుకెళ్లేలా నాయకత్వం ఇవ్వగలిగిన వాళ్లు రాణించగలుగుతారని చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంటరీ నేత లావు కృష్ణదేవరాయలు, పలువురు ఎంపిలు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్