ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రగవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నిర్వహించిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు ప్రధాన నాయమూర్తి(హెచ్‌సిజె) లీసా గిల్ తదితరులు హాజరయ్యారు. విజయవాడలోని లోక్‌భవన్‌లో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. సతీసమేతంగా చేరుకున్న చంద్రబాబు, హెచ్‌సిజె అనంతరం గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. వందేమాతరం, జాతీయ గీతాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం గవర్నర్ ఎట్‌హోంకు హాజరైన వారి వద్దకు వెళ్లి స్వాతంత్ర దినోతవ్స శుభాకాంక్షలు తెలిపారు.డిజిపి హరీష్‌కుమార్ గుప్తా, మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, ఎంపి సానా సతీష్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు తదితరులు హాజరయ్యారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గవర్నర్ నిర్వహించిన తేనేటి విందుకు హాజరు కాలేదు. తీవ్ర జ్వరం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ అనంతరం రాజమహేంద్రవరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను శనివారం ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది.








కామెంట్‌లు (0)