- వరుస దాడుల్లో ఐదుగురు మృతి
- షార్క్‌ను పట్టుకుని చంపాలని ఆదేశం
సిడ్నీ: పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన ఉన్న సొరెంటో బీచ్‌లో షార్క్ దాడికి గురై 63 ఏళ్ల గ్రెగ్ ఓ'నీల్ మృతి చెందారు. సముద్రంలో ఈత కొడుతుండగా ఈ దాడి జరిగింది. ఆయన మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఇది ఐదో షార్క్ దాడి కాగా, ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. జనవరిలో సిడ్నీ హార్బర్‌లో బుల్ షార్క్ దాడిలో గాయపడిన 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మే 16న పెర్త్ తీరంలో జరిగిన దాడిలో 38 ఏళ్ల స్టీవ్ మట్టాబోని ప్రాణాలు కోల్పోయారు.
ఆస్ట్రేలియన్ షార్క్ ఇన్సిడెంట్ డేటాబేస్ ప్రకారం 2000 సంవత్సరం నుంచి దేశంలో ఏటా సగటున రెండు నుంచి మూడు షార్క్ దాడులు నమోదవుతున్నాయి. బాధితుల్లో పలువురు సర్ఫింగ్, స్కూబా డైవింగ్ వంటి సముద్ర వినోద కార్యకలాపాల్లో పాల్గొన్నవారే. వరుస దాడుల నేపథ్యంలో, దాడికి కారణమైనట్లు భావిస్తున్న గ్రేట్ వైట్ షార్క్‌ను పట్టుకుని చంపాలని అధికారులు ఆదేశించారు. పెర్త్‌తో పాటు పలు తీర ప్రాంతాలను ఆదివారం వరకు మూసివేశారు.







కామెంట్‌లు (0)