శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విఆర్ఎలు తమ సమస్యలపై ఎమ్మెల్యే బండారు కు వినతి

1 గంట క్రితం

VRAs submit a representation regarding their issues to MLA Bandaru.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : రాష్ట్ర విఆర్ఏల సంఘం(జేఏసీ) పిలుపుమేరకు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండల విఆర్ఎ లు తమ కనీస అవసరాలకు సంబంధించిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ నాలుగవ రోజున శనివారం కూడా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరవధిక సమ్మెలో ఉన్న వీఆర్ఏల ధర్నా శిబిరం వద్దకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విచ్చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే బండారుకు మండల విఆర్ఎల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు తాతపూడి ఇసాక్, భువనగిరి ఏసు, కార్యదర్శి కాంతేటి శివరామారావు, తదితరులు వినతి పత్రం అందజేసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పే స్కేల్ అమలు చెయ్యాలని, నామినీలను విఆర్ఎ లు గా నియమించాలని, అర్హులకు ప్రమోషన్, కారుణ్య నియామకాలు చేపట్టాలని తదితర సమస్యలపై డిమాండ్లు ఉన్నాయని ఎమ్మెల్యేకు వివరించినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు తగు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సలహాదారు గూనపల్లి నాగేశ్వరరావు, కోశాధికారి కుందేటి శ్రీను, సభ్యులు సిద్దిల చంటిబాబు, తదితర విఆర్ఎలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్