అమరావతి : తాను ‘సిఇఒ సిఎం’గా కంటే నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలనుకుంటున్నానని సిఎం చంద్రబాబు అన్నారు. తన వారసత్వం నీటి ప్రవాహంలో కనిపించాలని కోరుకుంటున్నాన్నారు. శనివారం సిఇఒ సిఎం టు వాటర్ మాన్ : నాయుడుస్ లాంగ్ జర్నీ ఎంటర్స్ టూ ఏ న్యూ ఫేజ్ పేరుతో ఎకనామిక్ టైమ్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పై వార్తా కథనం వెలువడింది. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ, వెలిగొండ ప్రాజెక్టులు మైలురాళ్లని ఆయన అభివర్ణించారు. దశాబ్దాల కలగా ఉన్న ఈ రెండు కీలక సాగునీటి ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పు చూస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టులు.. రైతులకు ఆశ, వ్యవసాయానికి కొత్త ఊపును ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాగు నీటి భద్రతకు ఇవి చిరస్థాయిలో నిలిచిపోయే ఆస్తులుగా మిగులుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలనుకుంటున్నా : సిఎం చంద్రబాబు
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 11:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)