శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమ‌రావ‌తిలో ట్రంక్‌, ఎల్పీఎస్ జోన్లలో నిర్మాణాల ప‌రిశీల‌న‌

56 నిమిషాల క్రితం

Inspection of constructions in trunk and LPS zones in Amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తుళ్లూరు (అమరావతి) : రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్ధేశిత గడువులోగా నిర్మాణ ప‌నులు పూర్తికావాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌ (ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం రాజ‌ధానిలో ఏడీసీ చేప‌డుతున్న ట్రంక్ ర‌హ‌దార్లు, ఎల్పీఎస్ జోన్ల నిర్మాణాల‌ను క్షేత్ర‌స్థాయిలో పరిశీలించారు. ఉండ‌వ‌ల్లి, పెనుమాక గ్రామాల వ‌ద్ద కొండ‌వీటివాగులో 3.75 కి.మీ.ల మేర జ‌రుగుతున్న వ‌ర‌ద నియ‌త్ర‌ణ ప‌నుల‌ను పరిశీలించారు. రానున్న వారం రోజుల్లో నూరుశాతం ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని ఛీఫ్ ఇంజినీరు బి.న‌ర‌సింహ‌మూర్తిని ఆదేశించారు. అదేవిధంగా ఈ-6 రోడ్డు వెల‌గ‌పూడి నుంచి అనంత‌వ‌రం వ‌ర‌కు జ‌రుగుతున్న నిర్మాణాల‌ను ప‌రిశీలించి ఇది వీఐపీ మార్గం కావడంతో ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని,కనెక్టివిటీ రోడ్ల నిర్మాణాల‌లో ఎక్క‌డా అవాంత‌రాలు లేకుండా చూడాలన్నారు. ఎన్‌-9 రోడ్డులోని సైక్లింగ్‌,వాకింగ్ ట్రాక్‌ల‌కు రంగులు వేయడంతో ఆకర్షణీయంగా ఉండడాన్ని పరిశీలించి అధికారుల‌కు మరికొన్ని సూచ‌న‌లు చేశారు.రాజ‌ధాని రైతుల‌కు అభివృద్ధి చేసి ఇస్తున్న ఎల్ పిఎస్ లే అవుట్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూశారు. ఇందులో ముఖ్యంగా జోన్ - 9లో (బ్లాక్ - 6), జోన్ 5-సిలో(బ్లాక్‌-4) ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఇక్క‌డ జ‌రుగుతున్న నిర్మాణాల‌ గురించి ఛీఫ్ ఇంజినీరు సీహెచ్‌.ధ‌నుంజ‌య సీఎండీ కి వివరించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఏడీసీ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్