శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'ఆమె లేకపోతే నా జీవితం వ్యర్థం` : సిద్ధార్థ్

1 గంట క్రితం

'My life is meaningless without her': Siddharth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 03:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : 'ఆమె లేకపోతే నా జీవితం వ్యర్థం` అని హీరో సిద్ధార్థ్ తన భార్య అదితి గురించి చెప్పారు. ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వెబ్ సిరీస్ విజయంతో ఉత్సాహంగా ఉన్న సిద్ధార్థ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ నేను ప్రేమని నమ్మాను కాబట్టే అదితి నాకు దొరికింది. ఆమె నా సోల్‌మేట్. అదితి పుట్టినందుకు నేను రోజూ కృతజ్ఞతలు చెబుతుంటాను. ఆమె లేకపోతే నా జీవితాన్ని ఊహించుకోలేను. ‘రంగ్ దే బసంతి’ తర్వాత 20 ఏళ్లకు ‘సఫేద్ సాగర్’ లాంటి విజయం దక్కినందుకు ఎంత ఆనందంగా ఉందో.. అదితి నా జీవితంలోకి వచ్చినందుకు అంతే సంతోషంగా ఉంది ’’ అని చెప్పారు. మరోవైపు, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ వ్లాగ్‌లో పాల్గొన్న అదితి కూడా సిద్ధార్థ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపించిందన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ .... ‘' ఆ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టలేదు. సిద్ధార్థ్‌ చాలా మంచి వ్యక్తి. ఆయనలో ఎలాంటి కల్మషం ఉండదు. చాలా సహజంగా ఉంటాడు. అన్నింటికీ మించి నా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తాడు. నాకు కావాల్సిన వాళ్లందరినీ ఒక్కచోట చేర్చుతాడు. ఆ తత్వమే నాకు బాగా నచ్చింది ’’ అని అదితి చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్