అమరావతి : ఎపి లోని ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుతో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించడానికి సిఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. పీఆర్సీతో పాటు రెండు డీఏలు, ఒక సరెండర్ లీవ్ (పోలీసులకు అదనంగా సరెండర్ లీవ్), రిటైరైనవారికి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, ఈహెచ్‌ఎస్ బకాయిలు ప్రతి నెలా ఒకటో తేదీన ట్రస్ట్‌కి చెల్లింపు తదితర సమస్యల పరిష్కారానికి సిఎం హామీ ఇచ్చారని సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలని తాము కోరామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఐఆర్ విషయంపై కొంత సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని సూర్యనారాయణ తెలిపారు.
ఈ నేపథ్యంలో ... ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల సమస్యల పైన ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేసారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం...వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీతో పాటుగా పెండింగ్ డీఏల చెల్లింపు పైనా నిర్ణయం ప్రకటించారు. వీటి అమలు విధి విధానాల పైనా స్పష్టత ఇచ్చారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విధంగా 12వ PRC నియామకానికి అంగీకారం తెలిపారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న రెండు డీఏలను వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లింపుకు అంగీకారం కుదిరింది. 1-7-2024, 1-1-2025 డీఏలు విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేయడానికి అంగీకరించారు. ఇక.. పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లింపు చేస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపు పైనా నిర్ణయం జరిగింది. కాగా .... ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు చంద్రబాబు అంగీకరించారు. ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. చంద్రబాబుతో జరిగిన చర్చలు.. నిర్ణయా ల పైన ఉద్యోగ సంఘాల నేతలు సానుకూలంగా స్పందించారు.








కామెంట్‌లు (0)