- రైల్వేకోడూరులో 38 నామినేషన్లు దాఖలు
- వైసిపి అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు
ప్రజాశక్తి రైల్వేకోడూరు : తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ కేంద్రం ఎంపీడీవో కార్యాలయం వద్ద మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయులు వర్గీయులు, జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం ఘర్షణ చోటుచేసుకుంది. జనసేనకు చెందిన ప్రముఖ నాయకుడిపై బత్యాల వర్గీయులు దాడి చేశారు. పోలీసులు లాటి చార్జి చేయడంతో ఘర్షణ సర్దుమణిగింది.
రైల్వే కోడూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు 38 దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. అందులో టిడిపి 33, జనసేన నాలుగు, బిజెపి ఒకటి నామినేషన్లు దాఖలు చేశారు. రాత్రి 7 గంటల పైగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఉదయం నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులను పోలీసులు ఓటమి నాయకులు అడ్డుకోవడంతో ఎంపీడీవో కార్యాలయం వద్ద తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం వైసిపి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, మళ్లీ ఒకసారి అంబటి మురళి తదితరులు పోలీసులతో వాగు వివాదానికి దిగారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటమి అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయని, అనంతరం వైసిపి అభ్యర్థులు వచ్చి నామినేషన్లు వేసుకోవాల్సిందిగా పోలీసులు వైసీపీ నాయకులకు తెలిపారు. వైసిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో చాలాసేపు వేచి చూసి అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో ప్రధాన రహదారిలో రెండవ వైపుల భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.







కామెంట్‌లు (0)