సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

10 రోజులయ్యింది.. ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లేదు ..!

1 గంట క్రితం

It has been 10 days... there is no trace of the seven fishermen!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 03:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అల్లవరం (కోనసీమ) : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. 10 రోజుల్లో రావల్సిన మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3 న ఓడలరేవు తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లారు. వెళ్లిన గంట నుంచే బోటు నుంచి సిగ్నల్స్ నిలిచిపోయాయని, పది రోజుల్లో తిరిగి రావాల్సిన మత్స్యకారులు.. ఇప్పటివరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెరైన్‌ పోలీసులు, మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన మత్స్యకారుల పేర్లు .... కోపనాతి రామకృష్ణ (కొమరగిరిపట్నం), సంఘాని తాతారావు (కాట్రేనికోన మండలం బలుసుతిప్ప), పాలెపు శాంతారావు (ఓడలరేవు), ఏసుదాస్ (అడగట్లపాలెం), కొల్లాటి శ్రీనివాస్ (ఓడలరేవు), కాటాడి సతీశ్‌ (పశువులంక), కర్రి రాముడు (నక్క రామేశ్వరం).


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్