సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెవివి మండలస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్

11 సెప్టెంబర్, 2026

alamuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని జొన్నాడ జడ్పీ హైస్కూల్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ శుక్రవారం నిర్వహించారు. ఈ పరీక్షలకు మండల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి 8 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక ఇచ్చిన కీ ద్వారా మూల్యాంకనం చేసి, విజేతలను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఏడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ బహుమతి కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ద్వితీయ బహుమతి నర్సిపూడి జడ్పీ హైస్కూల్ , తృతీయ బహుమతి మూలస్థానం జడ్పి హైస్కూల్ విద్యార్థులు విజేతగా నిలిచారు. అలాగే ప్రైవేటు పాఠశాల నుండి ప్రధమ, ద్వితీయ బహుమతులు రెండింటిని ఆలమూరు శ్రీ సిద్ధార్థ స్కూల్, తృతీయ బహుమతిగా కొత్తూరు సెంటర్ శ్రీవిద్య కాన్వెంట్ విద్యార్థులు విజేతలుగా విజయం సాధించారు. అనంతరం బహుమతి ప్రధానం స్థానిక హై స్కూల్ హెచ్ఎం పి.ఏ.శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వై.వి.వి.రమణ, మండల అధ్యక్షులు అసదుల్లా ఖాన్, ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీనివాసరావు, యటీఎఫ్ మండల అధ్యక్షులు జి.జె.పుత్ర కుమార్, ఎస్టీయు అధ్యక్షులు సలాది శ్రీనివాసరావు, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి దాసరి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు ఎం.మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్