శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపి క్యాబినెట్ కీలక నిర్ణయాలు - 30 ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌

17 నిమిషాల క్రితం

Key decisions by the AP Cabinet Green signal given to 30 proposals
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి 30 కి పైగా కీలక అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా ఐటి, పరిశ్రమలు, రెవెన్యూ, హోం శాఖలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.


కీలక విధానాలు - ఆమోదించిన ప్రతిపాదనలు


ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ : 2026-31 కాలానికి గానూ ఏపీ ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌ (AVGC-XR) నూతన పాలసీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.


భీమిలిలో ఎఐ డేటా సెంటర్ : విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అమనాంలో భారీ స్థాయిలో 512 మెగావాట్ల సామర్థ్యంతో ‘ఎఐ డేటా సెంటర్’ ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించింది.


ప్రత్యేక ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ : ఎపి పోలీసు శాఖలో భద్రతను పెంపొందించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయనున్నారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ కొత్త విభాగం పనిచేస్తుంది.


ఇండస్ట్రియల్ పార్కులు : అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల్లో ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్కు, ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో 30 ఎకరాల్లో ఎఫ్‌ఎల్‌వో (FLO) మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.


నూతన పారిశ్రామిక విధానాలు: 2036 వరకు అమల్లో ఉండేలా రోబోటిక్స్, ఫిజికల్ ఎఐ పాలసీతో పాటు సెమీకండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0లో సవరణలకు ఆమోదం తెలిపారు. వీటితో పాటు రాంబిల్లిలో ‘ఈప్యాక్ డేటా సెంటర్ యూనిట్’ ఏర్పాటు, నాయుడుపేటలో లిథియం బ్యాటరీ మెటీరియల్ తయారీ పరిశ్రమ, రూ.4 వేల కోట్ల పెట్టుబడితో 'కార్బన్ కార్బో' సంస్థ పరిశ్రమల స్థాపనపై క్యాబినెట్‌లో విస్తృతంగా చర్చించారు. వివిధ జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు, పలు కొత్త ఇంధన ప్రాజెక్టులకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్