శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డీ లిమిటేషన్‌ బిల్లును ఆమోదించిన కేంద్ర కేబినెట్‌

19 నిమిషాల క్రితం

Union Cabinet .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రతిపక్ష‍ాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నియోజకవర్గాల పునర్విభన బిల్లు (డీ లిమిటేషన్‌) బిల్లును కేంద్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన వర్షాకాల సమావేశాల సమయంలో, మోడీ ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి యత్నాన్ని లోక్‌సభ తిరస్కరించింది. డీలిమిటేషన్‌ను అమలు చేయడానికి, మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడానికి అవసరమైన రాజ్యాంగ సవరణను కేంద్రం ఆమోదించింది. సవరించిన బిల్లు ప్రకారం... 2051 వరకు ప్రస్తుత నిష్పత్తిపై గరిష్ట పరిమితితో, సమాన నిష్పత్తి పద్ధతిలో రాష్ట్రాల వ్యాప్తంగా సీట్లను 50శాతం పెంచాలని ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 30 నుండి పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.


సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్