కేరళ : ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత మార్టిన్ ప్రక్కత్తో పాటు మరో ఇద్దరిపై కొచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమాలో ఓ వ్యక్తి మొబైల్ నంబర్‌ను అతడి అనుమతి లేకుండా చూపించారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. కొచ్చికి చెందిన అక్షయ్ ప్రకాష్ (26) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎర్నాకుళం కోర్టు ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మార్టిన్ ప్రక్కత్తో పాటు సహ నిర్మాతలు సిబి చవారా, రంజిత్ నాయర్లను నిందితులుగా పేర్కొన్నారు. సినిమాలో ఓ మహిళ పాత్రకు ఫోన్ నంబర్‌గా తన మొబైల్ నంబర్‌ను చూపించారని అక్షయ్ ఆరోపించారు. దీంతో తనకు పలుమార్లు అసభ్యకర సందేశాలు, బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిందని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మార్టిన్ ప్రక్కత్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా, 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమా 2025 లో విడుదలైంది. జీతూ అష్రాఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్టిన్ ప్రక్కత్, సీబీ చవారా, రంజిత్ నాయర్ నిర్మించారు.
సినిమాలో ఫోన్ నెంబర్ - దర్శకుడిపై ఎఫ్ఐఆర్
9 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 04:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు





కామెంట్లు (0)