గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్ 1-3 చలో పార్లమెంట్ జయప్రదం చేయండి

3 గంటల క్రితం

ntr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 02:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్

ప్రజాశక్తి - రెడ్డిగూడెం మండలం : లేబర్ కోడ్స్ రద్దు-- కనీసం వేతనం 42,000 అమలుకై డిసెంబర్ 1 2 3 తేదీలలో చలో పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుందని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్ అన్నారు. గురువారం పంచాయతీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు టెండర్ విధానం రద్దుచేసి కనీస వేతనం అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని అన్నారు. నిత్యం గ్రామాల శుభ్రం చేస్తూ, గ్రామాల అభివృద్ధి కోసం వెట్టిచాకిరి చేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులను దుర్మార్గంగా చూస్తున్నారని, అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారని, చాలీచాలని జీతంతో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కుల సంరక్షణ కోసం డిసెంబర్1, 2 ,3 తేదీలలో జరుగు పోరాటం, మరో స్వతంత్ర పోరాటంగా ప్రజలందరూ భావించాలని అన్నారు. దేశంలో నెలకొన్న అధిక ధరలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మతోన్మాదం, పెట్టుబడిదారీ వ్యవస్థలకు దేశ సంపదను దోచిపెట్టడంనికి వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతుందని, ఈ పోరాటంలో కార్మిక వర్గం అంతా ఏకతాటిపై పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎర్రంశెట్టి వీరమ్మ, కార్యదర్శి చందర్రావు, మేస్త్రి అంబటి శివ, రవి, రమేష్, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్