సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపై ఉండాలి : వైఎస్‌.జగన్‌

46 నిమిషాల క్రితం

May Lord Vigneshwara's grace be upon all the people: Y.S. Jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 11:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తాడేపల్లి : రాష్ట్ర ప్రజలకు వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని వైఎస్‌ జగన్‌ కోరుకున్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారాయన. అంతకు ముందు.. ఓ సందేశంలో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే వైఎస్‌ జగన్‌ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్‌ జగన్‌ అభిలషించారు.








ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్