లక్నో : 5 జి నెట్‌వర్క్ రావడం లేదని .... గ్రామస్తులు టెక్నీషియన్‌ను బంధించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలోని హర్దౌలి గ్రామంలో 5 జి నెట్‌వర్క్ రావట్లేదని ఆగ్రహంచిన స్థానికులు.. ఓ మొబైల్ టవర్ టెక్నీషియన్‌ను నిర్బంధించారు. సెప్టెంబర్ 10న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం .. ఊరిలో రెండేండ్ల క్రితం మొబైల్ టవర్ ఏర్పాటు చేసినా ఇప్పటి దాకా 5 జి సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు టవర్ వద్దకు వచ్చిన టెక్నీషియన్‌ను అక్కడే బంధించారు.
Video - 5 జి నెట్‌వర్క్ రావడం లేదని .. టెక్నీషియన్‌ను బంధించిన గ్రామస్తులు
25 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 11:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)