సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెటిఆర్ పిఎ, పిఆర్వోలకు పోలీసుల నోటీసులు

44 నిమిషాల క్రితం

ktr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 11:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ శాసన సభ వేదికగా ఇటీవల జరిగిన ఆందోళనల వ్యవహారం ఇప్పుడు న్యాయపరమైన మలుపులు తిరుగుతోంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యక్తిగత కార్యదర్శి మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్‌ లకు సైఫాబాద్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ 7 న అసెంబ్లీ గేట్ నెంబర్ 3 వద్ద బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేపట్టిన నిరసన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఆర్‌ఐ బి.జంగయ్య ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 9 న బిఎన్ఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో భాగంగానే, కేసు విచారణాధికారి అయిన ఎస్సై సత్యనారాయణ సమక్షంలో ఈ రోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు, తమపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ వీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌లు వేశారు. ఈ పిటిషన్లను విచారించిన ఉన్నత న్యాయస్థానం... అరెస్టు వంటి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, కేసు దర్యాప్తును చట్టప్రకారం కొనసాగించవచ్చని కోర్టు ఇచ్చిన వెసులుబాటు ఆధారంగానే సైఫాబాద్ పోలీసులు ఈ విచారణ ప్రక్రియను ముందుకు తీసుకెళుతున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్