సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్రీడాకారుల విజయాలు దేశానికి గర్వకారణం : ప్రధాని మోడి

27 నిమిషాల క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆఫ్ఘానిస్తాన్ : ఆదివారం భారత క్రీడా రంగంలో విజయోత్సవం నెలకొంది. ఒకే రోజు హాకీ, క్రికెట్‌లో భారత జట్లు అద్భుత విజయాలను నమోదు చేశాయి. జూనియర్‌ ఆసియా కప్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకోగా, మహిళల క్రికెట్‌ జట్టు ఆసియా కప్‌ను ఎనిమిదోసారి కైవసం చేసుకుంది. ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టి 20లో భారత పురుషుల జట్టు కూడా విజయం సాధించింది.


భారత జట్ల వరుస విజయాలపై ప్రధాని నరేంద్ర మోడి హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు. మహిళల క్రికెట్‌ జట్టు ఆసియా కప్‌ సాధించడం గొప్ప విజయమని పేర్కొన్నారు. టోర్నీ మొత్తం జట్టు ఆత్మ విశ్వాసం, నిలకడ, స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించిందని ప్రశంసించారు. ఈ విజయం దేశంలోని యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. జూనియర్‌ ఆసియా కప్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో భారత హాకీ జట్లు విజేతలుగా నిలవడం పట్ల కూడా మోడి అభినందనలు తెలిపారు. పురుషుల ఫైనల్‌లో దక్షిణ కొరియాపై, మహిళల ఫైనల్‌లో చైనాపై భారత జట్లు విజయం సాధించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.


పవన్‌ కల్యాణ్‌ అభినందనలు ....

మహిళల ఆసియా కప్‌ విజేత భారత క్రికెట్‌ జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. జట్టు ప్రదర్శించిన నైపుణ్యం, నిబద్ధత, పోరాట పటిమ అభినందనీయమని పేర్కొన్నారు. ఈ విజయం భారత క్రికెట్‌తో పాటు దేశంలోని మహిళా లోకానికి గర్వకారణమని అన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్