బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపంటలకు నష్టం లేకుండా చర్యలు

1 గంట క్రితం

Nimmala Ramanaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి నిమ్మల రామానాయుడు

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : మురసు తుపాను, భారీ వర్షాలతో పొలాలకు నిలిచిన నీటిని డ్రెయిన్లు, కాలువల ద్వారా వెంటనే బయటకు పంపించి పంటలకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్‌ అధికారులతో బుధవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ.. పర్చూరు, బాపట్ల, చీరాల, ప్రత్తిపాడు ప్రాంతాల్లో నల్లమడ, పర్చూరు డ్రెయిన్లు గరిష్ట నీటిమట్టానికి మించి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బుడమేరు, ఎర్రకాలువ, గోనెలవాగు, తమ్మిలేరు, ఏలేరు నదులు, వాగులు, రిజర్వాయర్లకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పడిన భారీ వర్షాలతో వాగుల నుంచి ప్రకాశం బ్యారేజీకి 71 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. బుడమేరు క్యాచ్‌మెంట్ ప్రాంతంలో పడిన వర్షపు నీటిని బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి తరలిస్తున్నామని వెల్లడించారు. విజయవాడలో పడిన భారీ వర్షాల నేపథ్యంలో ఎనికేపాడు అండర్ టన్నెల్ (యూటి) నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి తరలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్‌ ‌కుమార్‌, సలహాదారు వెంకటేశ్వరరావు, ఇఎన్‌‌సి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్