ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి సహాయ నిధికి అమరావతిలోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) రూ.కోటి విరాళం అందజేసింది. ఆ సంస్థ ఛైర్మన్ జి విశ్వనాథన్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం కలిసి విరాళం అందజేశారు. అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, తుపాను బాధితులకు సహకారం అందించేలా విట్ ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా విట్ ప్రతినిధులను సిఎం చంద్రబాబు అభినందించారు.
ముఖ్యమంత్రిని కలిసిన కమాండింగ్ మేజర్ జనరల్
ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ- ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ శ్రీనివాస్ సమావేశమయ్యారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో ఆయన బుధవారం మర్యాదపూర్వకంగా సమావేశమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి స్థానిక మిలటరీ లోకల్ అథారిటీగా వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సైనిక దళాలకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని సిఎం తెలిపారు.








కామెంట్‌లు (0)