బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇడి విచారణకు హాజరైన అంబటి

1 గంట క్రితం

Ambatiesnotice.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 10:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు రవాణాలో జరిగిన అక్రమాల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం హైదరాబాద్‌‌లోని ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌ (ఇడి) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణంపై విచారణ చేపట్టిన ఇడి అధికారులు ‌విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే పలుమార్లు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఎట్టకేలకు బుధవారం విచారణకు అంబటి హాజరయ్యారు. ప్రధానంగా మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కోణంలో ఆయనను ఇడి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అక్రమ నిధుల మళ్లింపులో మరికొందరు నేతలు, అధికారుల పాత్రపై ఇడి ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం మీడియాతో అంబటి మాట్లాడుతూ తాను ఇడి అధికారుల విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. తనకు తెలిసిన వివరాలన్నీ అధికారులకు చెప్పానన్నారు. ప్రజాప్రతినిధిగా అనుచరులకు రికమెండ్ చేయడం సాధారణమన్నారు. రవాణా టెండర్లకి సంబంధించి తన అనుచరుడు వాసుదేవరెడ్డిని రికమెండ్ చేశానని తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్