ప్రజాశక్తి - తిరుమల : తిరుమల కొండపై విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వెళ్తున్న ఓ ఎన్ఆర్ఐ గుండెపోటుతో మరణించారు. 800వ మెట్టు దగ్గర యాత్రికులు చూస్తుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం తెలియగానే టిటిడి సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందారని పరీక్షించి వైద్యులు తెలిపారు. మృతుడు న్యూజెర్సీకి చెందిన సుర్జీత్ రెడ్డి (55) గా నిర్ధారించారు.








కామెంట్‌లు (0)